స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని ఆనంద నిలయం విజువల్స్ చిత్రీకరించిన వారిని గుర్తించేందుకు సీసీ పుటేజిని పరిశీలించిన టీటీడీ అధికారులు… ఓ మహిళా భక్తురాలు ఆలయ దృశ్యాలను చిత్రీకరించినట్టు గుర్తించారు. ఆలయ వీడియోను మొబైల్ ఫోన్ తో కాకుండా సీక్రెట్ కెమేరాతో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. దీంతో విజిలెన్స్ అధికారులు మహిళా భక్తురాలి వివరాలు సేకరిస్తున్నారు. సీక్రెట్ కెమేరాతో చిత్రీకరించినట్లు నిర్దారణ అయితే మహిళా భక్తురాలిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం కనిపిస్తుంది. విచారణలో భక్తురాలి ఉద్దేశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.