మాజీమంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఫైరయ్యరు. ట్రిపుల్ ఆర్ విషయంలో మంత్రి కోమటి రెడ్డి మీద చేసే ఆరోపణల్లో పస లేదని అన్నారు. రూ. 7వేల కోట్లు ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు కాస్ట్ అయితే.. రూ. 12వేల కోట్లు తిన్నారని కేటీఆర్ అంటున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోచుకునే.. దాచుకునే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని ప్లాన్ చేసింది బీఆర్‌ఎస్సేనని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్టిమేషన్‌కు, అయిన ఖర్చుకు సంబంధం లేకుండా కాస్ట్ పెంచుకున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుందనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని… ప్రతిపక్షాన్ని బతికిస్తుంది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. పాలక పక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం హెచ్చరించడాన్ని స్వాగతిస్తామని కూడా చెప్పారు. కానీ బీఆర్ఎస్ నేతలు కేవలం రాజకీయాల కోసమే విమర్శలు చేస్తున్నారని చామల మండిపడ్డారు. 2025లో అయినా BRS నేతలకు జ్ఞానోదయం అయ్యి బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ అప్పులకు కారణం సాగు చేయని భూములకు రైతు బంధు ఇవ్వడమేని చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధు మీద కేసిఆర్‌కి ఏమాత్రం శ్రద్ధలేదన్నారు. రైతుబంధులో రూ.22వేల కోట్లు కాపాడుకొని.. ఇరిగేషన్, ఇతర పథకాలలో ఆదా చేసుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. కేంద్ర గ్రాంటూ తెచ్చుకుంటే బాగుండేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.
ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని చామల ఫైరయ్యారు. కేటీఆర్ తప్పు చేయకపోతే నిర్దోషిగా నిరూపించుకోవాలని హితవు పలికారు.. తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హాయంలో IAS అధికారులకు సింగిల్ విండో ద్వారా ఆదేశాలు వెళ్ళేవని అన్నారు. కాంగ్రెస్ హాయంలో మల్టిపుల్ విండో ద్వారా ఆదేశాలు వెళ్తాయని .. అందుకే కొంత ఆచరణకు ఆలస్యం అవుతుందని అన్నారు. పుష్ప అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని చామల అన్నారు.