25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

ఈశాన్య భారతంలో కాంగ్రెస్ పట్టు సాధించేనా ?

  ఈశాన్య భారతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గత పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి.ఈ పదేళ్లకాలంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది .భారతీయ జనతా పార్టీ బలపడింది. ప్రస్తుతానికి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. మిగతా చోట్ల ప్రభాత్వాల్లో భాగస్వామిగా ఉంది కమలం పార్టీ.

   ఈశాన్యంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 14 సీట్లు ఒక్క అస్సాంలోనే ఉన్నాయి. ఒకప్పుడు అస్సాం రాజకీయాలను కాంగ్రెస్, అస్సాం గణపరిషత్ శాసించాయి. కాలక్రమంలో కాంగ్రెస్, అస్సాం గణపరిషత్ పార్టీల పరిస్థితి దెబ్బతిన్నది. చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్నాయి. మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు బీజేపీ తరఫున పెద్దదిక్కుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. ఈశాన్య భారతాన మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యతను హిమంత బిశ్వ శర్మపై పెట్టింది బీజేపీ హై కమాండ్. హిమంత ప్రస్తుతం నార్త్‌ – ఈస్ట్రన్ డెమొక్రటిక్ అల యన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఈశాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు హిమంత. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చాక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్ర మాలను అమలు చేసిందని హిమంత చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవడం వల్ల యావత్ ఈశాన్య భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి బాటలో పయనిస్తోందని హిమంత్ చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్  చేసిన అభివృద్ధిని ప్రజలు కూడా గమనించారన్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్యంలోని మొత్తం పాతిక సీట్లలో ఈసారి 22 సెగ్మెం ట్లను తామే గెలుచుకుంటా మంటు న్నారు హిమంత.

  ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రమైన అస్సాంలో మొత్తం 14 సీట్లున్నాయి. ఈసారి 11 సీట్లలో విజయం తమదే అంటున్నారు హిమంత బిశ్వ శర్మ. కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగొయ్‌ ఈసారి జొర్హాట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత తపన్ కుమార్‌తో గౌరవ్ గొగొయ్‌ తలపడుతున్నారు. ఈసారి ఈశాన్యాన అందరినీ ఆకర్షిస్తున్న రాష్ట్రం మణి పూర్‌. ఇక్కడ బీజేపీ సర్కార్ కొలువై ఉంది. ఇటీవలికాలంలో అల్లర్లు, ఘర్షణలకు మారుపేరుగా మారింది మణిపూర్‌. దీంతో ఈసారి మణిపూర్‌లో పొలిటికల్ హీట్ కనిపించడం లేదు. ఎన్నికల పట్ల ప్రజలు నిర్లిప్తంగా ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది. మణిపూర్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఒకటి ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం కాగా రెండోది ఔటర్ మణిపూర్ సెగ్మెంట్. కిందటేడాది అల్లర్లను అదుపుచేయడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యాయన్న అభిప్రాయం మణిపూర్‌ వాసుల్లో నాటుకుపోయింది. అంతేకాదు అల్లర్లు, గృహదహనాలకు పాల్పడినవారికి బీజేపీ అండదండలున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తు న్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మణిపూర్‌ నుంచే న్యాయ్‌యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మణిపూర్ అల్లర్లకు పరిష్కారం దొరుకుతుందన్న సంకేతాలు రాహుల్ పంపారు. కాగా ఈసారి మణిపూర్ పై రాహుల్ గాంధీ న్యాయ్‌యాత్ర ప్రభావం ఉంటుందన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

  మణిపూర్ లో 2009 అలాగే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం రెండు సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచు కుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒక సెగ్మెంట్‌ను అలాగే ఎన్ పిఎఫ్ మరో సెగ్మెంట్‌ను గెలుచుకున్నా యి. కాగా 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సగటున 67 శాతం ఓట్లు పోలయ్యాయి.అయితే మణిపూర్ లో 82,8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మణిపూర్ చరిత్రలో ఇదో రికార్డు. ఈశాన్య భారతంలోని మరో పెద్ద రాష్ట్రం త్రిపుర. కొన్ని దశాబ్దాలపాటు త్రిపురలో సీపీఎం అధికారం లో ఉంది. ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఉంది. త్రిపుర లో రెండు లోక్‌సభ సెగ్మెంట్లున్నాయి. ఈ రెండు సీట్లలోనూ ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంది. కాగా సిక్కింలో ఒకే ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ్నుంచి ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై గోపాల్ ఛెత్రి బరిలో నిలిచారు. అరుణా చల్ ప్రదేశ్ లో రెండులోక్ సభ స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్ల రెండు స్థానాలనూ బీజేపీయే గెలుచు కుంది. ఈ సారి కూడా రెండుస్థానాల్లోనూ విజయం సాధించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ దూకుడుమీద ఉంది. అయితే కాంగ్రెస్ కూడా రెండు సెగ్మెంట్లలోనూ బరిలో నిలిచింది. కాగా మేఘాలయ లో రెండు నియోజకవర్గాలున్నాయి. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. మేఘాలయ లో గత ఇరవై ఏళ్లుగా బీజేపీ బోణీయే చేయ లేదు. మేఘాలయలోని తుర లోక్‌సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ నేత సాలెంగ్ ఏ సంగ్మా పోటీలో ఉన్నారు. మిజోరంలో ఒకే ఒక్క నియోజకవర్గం ఉంది. 2009, 2014, 2019 లోనూ ఈ ఏకైక సీటును కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. నాగాలాండ్ లోనూ ఒకే ఒక్క సెగ్మెంట్ ఉంది. నాగాలాండ్ లో సహజంగా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై ఎస్‌ఎస్ జమీర్ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఈశాన్యంలో ఉనికి చాటుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్