25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

దేశవ్యాప్తంగా 326 సీట్లలో కాంగ్రెస్ పోటీ

కాంగ్రెస్ పార్టీది సుదీర్ఘ చరిత్ర. వందేళ్లకు పైబడ్డ చరిత్ర కాంగ్రెస్ స్వంతం. అందుకే కాంగ్రెస్‌ను గ్రాండ్ ఓల్డ్ పార్టీ గా పిలు స్తుంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలాకాలం పాటు కేంద్రంలో అధికారం లో ఉంది హస్తం పార్టీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసిం హారావు ….వీరంతా కాంగ్రెస్ పార్టీ ప్రతినిథులుగా ప్రధానులు అయిన వారే. అయితే 2014 తరువాత కాంగ్రెస్ పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. 2014 లో తొలిసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత ఐదేళ్లకు అంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి ఓటమి పాలయింది. ఈ ఓటమిని అప్పట్లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోయారు. దీంతో హతాశుడైన రాహుల్ గాంధీ అకస్మాత్తుగా కాడి కింద పడేశారు. ఏఐసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ఎంతగా సముదాయించడానికి ప్రయత్నించినా మళ్లీ ఏఐసీసీ అధ్యక్షపదవి స్వీకరించడానికి రాహుల్ అంగీకరించ లేదు.

    2019 తరువాత జాతీయ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి.గులాం నబీ ఆజాద్ వంటి బడా బడా నేతలు హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టారు. అనేక రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన హేమాహేమీల్లాంటి నేతలు కాంగ్రెస్‌ శిబిరం నుంచి వైదొలగారు. బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీల్లోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడింది. దీంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడా నికి ఆమ్‌ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ప్రయత్నించాయి. ఈ విషయంలో చాలా వరకు విజయవంతం కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో హస్తం పార్టీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు తెరమీదకు వచ్చాయి.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కేవలం 326 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. వాస్తవానికి 2004 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వరకు ఇదే అత్య ల్ప సంఖ్యగా ఉండేది. అయితే ఈసారి ఈ సంఖ్య 326కు పడిపో యింది. కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ సీట్లలో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏ మాత్రం బాగా లేదు. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

     కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మళ్లీ లేచి నిలబడింది. వెంటిలేటర్‌ మీద ఉన్న కాంగ్రెస్‌కు ఆక్సిజన్ లభించినట్లయింది. కన్నడ ఓటర్ల తీర్పు ఫలితంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రాధాన్యం పెరిగింది. బీజేపీయేతర పార్టీలకు కాంగ్రెస్‌ పెద్ద దిక్కుగా నిలిచింది. దీంతో ప్రతిపక్షాలు వరుస సమావేశాలు నిర్వహించాయి. జేడీ యూ అధినేత, బీహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ చొరవ తీసుకుని పాట్నాలో బీజేపీయేతర తొలి భేటీని ఏర్పాటు చేశారు. ఆ తరు వాత బెంగళూరు, ముంబైల్లో బీజేపీయేతర ప్రతిపక్షాల వరుస సమావేశాలు జరిగాయి. ఈ సమావే శాలకు 28 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత జనాకర్షణగల నేతగా ప్రధాని నరేంద్రమోడీ నిలిచారు. అయోధ్య అంశంతో సామాన్య ప్రజల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది. దీంతో బీజేపీ నాయకత్వలోని ఎన్డీయే కూటమిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి లోని వివిధ భాగస్వామ్యపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు కుదుర్చుకుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఎవరి తోనూ పొత్తు లేకుండా ఒంటరిపోరు చేస్తోంది. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, చత్తీస్‌గఢ్‌,ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌, గోవా, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కింతోపాటు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్