28.2 C
Hyderabad
Monday, May 20, 2024
spot_img

సీఎం జగన్ వ్యక్తిగత ఇమేజ్ పార్టీని గెలిపిస్తుందా?

    రాజకీయాల్లో ఉన్న వారికి ప్రజల్లో నమ్మకం చాలా ముఖ్యం. ఒకసారి ప్రజల్లో నమ్మకం కోల్పోతే, ఆ తరువాత ఏం చెప్పినా జనం ఎవరూ విశ్వసించరు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా పర్యటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు పడుతున్న కష్టాలు స్వయంగా చూశారు. తమ ప్రభుత్వం వస్తే ప్రజల కష్టాలకు ఎండ్ కార్డ్ వేయాలకున్నారు.

   ప్రజల కడగండ్లకు తెరదించడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన ఫలితమే..నవరత్నాలు. ఎన్నికల ప్రచారంలో ఈ నవరత్నాల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి పదేపదే ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వస్తే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్లుగా నవరత్నాలు అమలు చేసి తీరుతామన్నారు జగన్మోహన్ రెడ్డి. హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నవరత్నాలను అమలు చేయడం మొదలెట్టారు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారింది వాలంటీర్ల వ్యవస్థ. గతంలో ప్రభుత్వ పథకాలు అమలైతే, అవి లబ్దిదారులకు చేరడంలో విపరీతమైన జాప్యం జరిగేది. సంబంధిత పత్రాలు తీసుకుని ఎక్కడో దూరాన ఉన్న మండల కేంద్రానికి వెళ్లేవారు లబ్దిదారులు. అక్కడ ఎమ్మార్వో కార్యాలయం దగ్గర గంటల తరబడి, ఒక్కోసారి రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఆ సమయానికి కార్యాలయంలో ఎమ్మార్వో ఉండొచ్చు. ఉండకపోవచ్చు. దీంతో ఒకటికి పదిసార్లు బస్సు చార్జీల ఖర్చు పెట్టుకుని ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరిగేవారు లబ్దిదారులు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణప్రాంతాల ప్రజల కష్టాలకు చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే విలేజ్ వాలంటీర్ సిస్టమ్.

   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం మౌలికంగా వాలంటీర్ల పని. వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందేవారి కష్టాలు తీరాయి. ప్రభుత్వ సేవలు పల్లె ప్రజలకు చాలా సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వలంటీర్ యాభై కుటుంబాలను కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యాభై కుటుంబాలకు ప్రభుత్వ పరంగా వివిధ పథకాల కింద వచ్చే సొమ్మును వాలంటీర్లు అందిస్తారు. ప్రతి వాలంటీర్‌కు గుర్తింపు కార్డు ఉంటుంది. గత ఐదేళ్లకాలంలో విద్యావిధానంలో మహత్తర విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేసింది జగన్ సర్కార్‌. అంతేకాదు చిన్నారుల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టింది. ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు కోవడం వల్ల విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు వస్తుంది. ఇలా ఇంగ్లీషులో పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి పోటీ పరీక్షలు దీటుగా రాసే సత్తా వస్తుంది. దీంతో తమ పిల్లలను ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులుగా చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కృషి చేస్తోందన్న అభిప్రాయం చిన్నారుల తల్లిదండ్రుల్లో కలుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ పేద ప్రజలకు మేలు చేసే విషయంలో అనేక విజయాలు సాధించినప్ప టికీ, ఆ విషయాన్ని విస్మరించింది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ. పైపెచ్చు సామాన్య ప్రజల్లో జగన్ సర్కార్‌ను బద్నాం చేయడానికి కుట్రలు చేయడం మొదలెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిపాద నను తాజాగా తెరమీదకు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. ల్యాండ్ టైటిలింగ్ ప్రతిపాదన చట్టమైతే, ప్రజలు తమ స్వంత భూములపై యాజమాన్య హక్కులు కోల్పోతారని విష ప్రచారం మొదలెట్టింది.

   ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎమ్మార్వో లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా భూములకు సంబంధించిన వివాదాలే కనిపిస్తుంటా యి. దీనికి ప్రధాన కారణం దొంగ రిజిస్ట్రేషన్లు. తప్పుడు డాక్యుమెంట్లే. దీంతో అవి చివరకు వివాదాస్పద భూములుగా మారుతున్నాయి. దీంతో ప్రైవేటు సెటిల్మెంట్లు మొదలయ్యాయి. అవి కుదరకపోతే చివరకు ఒక్కోసారి హత్యలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ స్టేషన్లలో నమోదైన మెజారిటీ కేసలు భూ వివాదాలకు సంబంధించినవే. దీనికి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం. భూముల వివాదాలకు శాశ్వతంగా ఎండ్ కార్డ్ వేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించు కుంది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది జగన్ సర్కార్. నీతి ఆయోగ్ సూచించిన మోడల్ చట్టం ఆధారంగా జగన్ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదనను తీసుకు వచ్చింది. ఈ చట్టం రావడం వల్ల భూములపై యజమానులకు సంపూర్ణ హక్కులుంటా యని బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది.

దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తే, అప్పుడు దేశవ్యాప్తంగా ఒకే టైటిల్ రిజస్టర్ నిర్వహించడానికి వీలు అవుతుంది.కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా అదే. దీని వల్ల దేశంలో ఎక్క డైనా ఎవరైనా భూమి కొనుగోలు చేయవచ్చు. విజయవాడ వాసి ఢిల్లీలో భూమికొన్నా, సదరు భూమిని విజయ వాడ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతటి వెసులు బాటు ఉంటుంది ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో. ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి రావడం అంటూ జరిగితే, డబుల్ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిం చడం వంటి వాటికి ఎండ్ కార్డ్ పడుతుంది. భూముల యజమానులకు ఇంతగా మేలు చేసే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రతిపాదన పై కూడా అవాస్తవాలు ప్రచారంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విగ్నతపై ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉంది. ప్రజలకు మంచి చెడులను వేరు చేసి, చూసే సత్తా ఉందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అదే ధీమాతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Latest Articles

నేడు ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్

   దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్