26.7 C
Hyderabad
Tuesday, April 23, 2024
spot_img

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరేనా ?

        వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయనుందా…? బీజేపీతో పొత్తు లేనట్లేనా…? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడుతుందా…? ఇంతకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా…?.

      తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. అధికార కాంగ్రెస్ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూనే సమరానికి దిగింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోనే లేదు. మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కో బోతుంది. అంతకు ముందు వచ్చిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు అగ్ని పరీక్షగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ కనబర్చకపోతే పార్టీ డీలా పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ రాజీనామా పర్వం పట్టారు.ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తొమ్మిది లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారాన్నే పోగొట్టుకుంది. దీంతో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.

       అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం అధిష్టానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గళం, బలం, దళం నినాదంతో బరిలోకి దిగుతా మని క్యాడర్‌కు దిశానిర్దేశం చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ సవాల్ ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీల మధ్యే వచ్చే పార్లమెంట్ ఎన్ని కల్లో పోటీ ఉంటుందని..ఆ పార్టీల నేతలు బీఆర్ఎస్‌ను ఆత్మ రక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

     తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కి సవాల్ విసురుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం బీఆర్ఎస్‌కి కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే..బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన గులాబీ బాస్ కేసీఆర్ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతల అభిప్రాయాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలైన పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకటి లేదా రెండు స్థానాలకే పరిమితం అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది.

     వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్‌ని నిలువ రించవచ్చనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో మూడవసారి కమలం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చనేది కేసీఆర్ వ్యూహంగా సమాచారం. త్వరలోనే గులాబీ బాస్ ఢిల్లీకెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలోనే అలెర్ట్ అయిన తెలంగాణ బీజేపీ నేతలు..ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదని కామెంట్లు చేస్తున్నారు.

    వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తమ పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా బీఆర్ఎస్‌తో పొత్తుకు సుముఖంగా లేదని బీజేపీ నేతలు చెపుతున్న మాట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామ మాత్రపు పోటీకి పరిమితం అవుతుందనే వాదన బీజేపీ చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ సెక్యులర్ నాయకుడిగా ఉన్నారంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్‌కి పొత్తు ఉండదని చెపుతు న్నారు. బీఆర్ఎస్ సింగిల్‌గానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు.బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ప్రచారంపై బీజేపీ నేతలు వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌కి పొత్తు దారులు మూసుకుపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని బీఆర్ఎస్ ఏ విధంగాఎదుర్కొంటుందనేది చూడాలి . 

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

సీఎం ట్వీట్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్‌ చేసారు. ట్వీట్‌కు జతచేసిన వీడియోకు కాంగ్రెస్‌కు...కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ అంటూ కామెంట్‌ చేసారు. భువనగిరి ఎంపీ అభ్యర్ధి కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్