ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్కైందని చెప్పారు. చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూములు సమస్య ను సీఎం జగన్ పరిష్కరించారని సజ్జల అన్నారు.