28 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

పోలవరం ధ్వంసం ఎవరి పాపం

  పోలవరం ప్రాజెక్టును దారిలో పెట్టడానికి విదేశీ నిపుణులను పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన.. పోలవరాన్ని ఎంతలా ధ్వంసం చేశారంటే, చివరకు దానిని దారిలో పెట్టేందుకు విదేశీ నిపుణులను పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పోలవరానికి విదేశీ నిపుణులు రానున్నా రని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం అని అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపం లా మారాడన్నారు. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది అన్నారు. అలాంటి ప్రాజెక్టు జగన్ చేసిన విధ్వంసానికి గురైందని అన్నారు. 90 మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేసాం అని స్పష్టం చేశారు. పో 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తిoచి 72 శాతం పూర్తి చేశాం అన్నారు. కానీ, జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలంటే 990 కోట్లు అవసరమవుతాయన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్