Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు

   వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు ఎవరి వైపు ఉంటారు? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి అండగా ఉంటారా? ఎవరి హయాంలో బీసీలకు ఎక్కువ ప్రయోజనం కలి గింది. బీసీ ఛాంపియన్లు మేమంటే.. మేమే అంటున్న వైసీపీ, టీడీపీలలో బీసీలు నమ్మేది ఎవరిని? ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో బీసీలకు ప్రాధాన్యమిస్తుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ అంటూ వారిపై వరాలు జల్లు కురిపిస్తోంది.

    ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బీసీ ఎజెండాను తెరపైకి తీసుకువచ్చాయి. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎవరి వైపు మొగ్గుచూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో బీసీల ఓట్లను కొల్లగొట్టేందుకు అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలలోని అన్ని వర్గాల వారీగా క్యాబినెట్లో మంత్రి పదవులు కేటాయించింది. మొదటి క్యాబినెట్లో ఆరుగురు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన వైసిపి రెండో క్యాబినెట్లోను బీసీలకు మరింత పెద్దపీట వేసింది. అంతేకాకుండా శాసనసభ స్పీకర్ వంటి కీలకమైన పదవిని సైతం బీసీ సామాజిక వర్గానికే కట్టబెట్టింది . అలాగే బీసీ సామాజిక వర్గాల వారీగా దాదాపు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల వారికి పదవులను కట్టబెట్టింది అధికార వైసిపి. ఇక అటు రాజ్యసభ ఎన్నికల్లోను బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వైసిపి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ,ఆర్. కృష్ణయ్య బీద మస్తాన్ రావు వంటి బీసీ నేతలను రాజ్యసభకు పంపించింది. శాసన మండలిలో సైతం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వారిని ఎమ్మెల్సీలుగా చేసింది. 2024 ఎన్నికల్లోను బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చేదిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారు. ఇప్పటికే వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ మార్పులు చేర్పుల జాబితాలో సైతం బీసీ సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్య మిస్తోంది. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గం ప్రాతి నిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను పోటీలోకి దింపుతున్నారు.

    మరోవైపు టిడిపి- జనసేన కూటమి సైతం వచ్చే ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీసీలు వైసిపికి మద్దతుగా నిలబడ్డారు. దీంతో తిరిగి బీసీలను అక్కున చేర్చుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మంగళగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వ హించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ప్రతి నెలా 4,000 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేకం గా లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. చట్టబద్ధంగా బిసి కులగణన చేయడంతో పాటు చంద్రన్న బీమా కింద పది లక్షల ఆర్థికసాయం, అలాగే బీసీ పిల్లల వివాహాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

    ప్రతిపక్షంలో ఇలా హామీలు ఇచ్చే చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నాయి బ్రహ్మణులు చంద్రబాబును కలిసిన సందర్భంలో వారి తోకలు కత్తిరిస్తానంటూ ముఖ్యమంత్రి హోదాలో వారిని బెదిరిం చిన తీరు అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఆ ఎన్నికల్లో బీసీలు టిడిపికి దూరం కావడానికి ప్రధాన కారణమని విమర్శ కూడా ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు రకరకాల హామీలు ఇస్తున్నారు. అయితే ఆ హామీలను బీసీ సామాజిక వర్గం ఎంతవరకు నమ్ముతుందనేది ఇంకా తెలియా ల్సి ఉంది.

     చంద్రబాబు ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటామంటూ బిసి డిక్లరేషన్ ప్రకటించడంపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నా రు. చంద్రబాబు 40 ఏళ్లలో ఒక్క బీసీని అయినా రాజ్యసభకు పంపిం చారా అంటూ మంత్రి ధర్మాన ప్రశ్నించారు. కేవలం ధనవంతులకు మాత్రమే చంద్రబాబు రాజ్య సభ సీట్లు ఇస్తారంటూ ఆయన విమర్శించారు చంద్రబాబు బిసి డిక్లరేషన్ కాపీ పేస్ట్ అంటూ మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైరయ్యారు. టిడిపి హయాంలో 142 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ ఆయన దుమ్మెత్తి పోశారు.

    వైసిపి బీసీల కోసం ఎంతో చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ పార్టీలోని బీసీ నేతలు జగన్ పై అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే పార్థసారథి, మంత్రి గుమ్మ నూరు జయరాం, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తి వంటి వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీసీలు టిడిపి, వైసిపిలలో ఎవరు వైపు ఉంటారనేది త్వరలో తేలిపోనున్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతు న్నాయి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్