29.2 C
Hyderabad
Monday, March 2, 2026
spot_img

హిండెన్‌బర్గ్‌ మూసివేత వెనుక ఎవరి హస్తం?

వడ్డించేవాడు ఎవడైనా వండేవాన్నీ నేనేరా అంటూ ముందుకొచ్చాడు ఒకడు. షేర్ మార్కెట్ ను మాసం ముక్కలా తింటున్న అదానీ గొంతులో వెలక్కాయ వేశాడు. అంతే సింగిల్ సిట్టింగ్ లో 8 లక్షల కోట్లు స్మాష్ అయ్యాయి. అప్పటి వరకు మార్కెట్ లో దూసుకుపోతున్న అదానీ షేర్లు.. అదోపాతాలాన్ని చూశాయి. దెబ్బకు మింగలేక.. కక్కలేక అదానీ చస్తే.. ఏం చేయాలో పాలుపోక.. ప్రధాని సైలెంట్ అయ్యారు. ఆ ఒక్క నివేదిక భారత్ లో భూకంపాన్ని పుట్టించింది. అదానీ షేర్లు అంటే.. హైఎండ్ హార్స్ పవర్ కలిగిన సూపర్ కార్ అనుకున్న మదుపరులకు.. ఆ రోజు మద్యం మత్తు ఎక్కినట్లు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతటి సంచనలం సృష్టించింది హిండెన్ బర్గ్.. దాని వెనుకున్నది నేథన్ అలియాస్ నేట్ అండర్సన్. సీన్ కట్ చేస్తే హిండెన్ బర్గ్ ను మూసేస్తున్నట్లు నేథన్ అలియాస్ నేట్ అండర్సన్ ప్రకటించారు. మరి ఈ నిర్ణయానికి కారణమేంటి? దీనికి వెనుక అదానీ ప్రధాని ఉన్నారా? అదానీ ప్రధాని కంటే పెద్దశక్తే పనిచేసిందా?

హిండెన్ బర్గ్… భారత్ లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. 2023లో హిండెన్ బర్గ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 38 ఏళ్ల ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌.. అతని సంస్థ ఇచ్చిన నివేదిక భారత్ లో భూకంపమే సృష్టించింది. భారత స్టాక్‌ మార్కెట్లు వణికిపోయాయి. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 10లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడైన గౌతమ్ అదానీ సామ్రాజ్యం.. ఆ రిపోర్ట్‌ దెబ్బకు కుప్పకూలిపోయింది. ఒక్క రిపోర్టు దెబ్బకు 10 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద అవిరై.. దలాల్ స్ట్రీట్ ఎరుపెక్కింది. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్న అదానీ గ్రూప్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ ఏడాది ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో మూడో స్థానం నుంచి ఏడుకు పడిపోయారు అదానీ.

హిండెన్ బర్గ్ రిపోర్టు కేవలం అదానీనే కాని ఆయన్ను నమ్ముకున్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగం సంస్థలను కూడా ముంచేసింది. ఆయనకు అప్పులిచ్చిన ఎస్‌బిఐ, పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీకి కూడా హిండెన్ బర్గ్ వణుకుపుట్టించింది. మరోవైపు అదానీ గ్రూప్‌ షేర్ల నష్టాలతో ఎస్‌బిఐ స్టాక్ కూడా అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో ఈ ప్రభుత్వ సంస్థల్లో డిపాజిట్లు చేసిన ప్రజలకు కొన్ని రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇతర బడా వ్యాపార సంస్థలకు వణకుపుట్టింది. అదానీ అక్రమాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మద్దతును ఇస్తుందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎన్‌డిఎ ప్రభుత్వం ఇరుకున పడింది. పార్లమెంటులో అదానీ అంశం పైనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. అయితే, అదానీ గ్రూపు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ తర్వాత గతేడాది ఆగస్టులోనూ హిండెన్‌బర్గ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండయా చైర్‌పర్సన్‌ మాధవి బచ్‌, ఆమె భర్త దావల్‌ బచ్‌ల పైనా ఆరోపణలు చేయటం, అది కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయటం సంచలనంగా మారింది.

ఏకంగా సెబీ సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు మార్కెట్ ను ఒక్క కుదుపు కుదిపాయి. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్ లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానీకి చెందిన మారిషన్, అఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని అఫ్ ఫోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్ లో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ పేల్చిన బాంబు పార్లమెంట్ ను సైతం కుదిపేసింది.

పార్లమెంట్ లో విపక్షాలన్నీ అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టడంతో అప్పట్లో ఆర్బీఐ కూడా అదానీ అప్పులపై దర్యాప్తు ప్రారంభించింది. స్థానిక బ్యాంకులకు కీలక ఆదేశాలిచ్చింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎంత మేర రుణాలు తీసుకున్నాయి. వాటి వివరాలను ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రభుత్వం, ప్రభుత్వేతర బ్యాంకులకు సూచించినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. పార్లమెంట్ లో అదానీ వ్యవహారంపై విపక్షాలు పార్లమెంట్ ను స్తంభింపజేశాయి. దాదాపు ఆ ఏడాది పార్లమెంట్ సమావేశాలు అన్నీ.. హిండెన్ బర్గ్ రిపోర్టు, అదానీ వ్యవహారం చుట్టూనే తిరిగినా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్చకు పెద్దగా సుముఖత చూపించలేదు.

అదానీ-హిండెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని అప్పట్లో విపక్షాలు పట్టుబట్టాయి. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కేసులు కూడా నమోదు అయ్యాయి. చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్ లో సంస్థలు మనుగడ సాగించలేవని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో అదానీ గ్రూప్ కు బిగ్ క్లీన్ చిట్ లభించినట్లయింది. ఇలా 2023-24 సంవత్సరాల్లో ప్రపంచకుబేరుల్లో ఒకరైన అదానీకి కంటిమీద కునుకు లేకుండా చేసింది హిండెన్ బర్గ్.

భారత్ లో ఇంత సంచలనం సృష్టించిన హిండెన్ బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇప్పుడు హిండెన్‌బర్గ్‌ని తన జీవితంలో ఓ అధ్యాయంగా చూస్తున్నట్లు తెలిపాడు. తనను నిర్వచించే ప్రధాన విషయంగా కాదని వెల్లడించాడు. చివరిగా అండరన్స్ పోంజీ స్కీమ్‌లపై చిట్కాలను రెగ్యులేటర్‌లకు అందించిన తర్వాత తన సంస్థను మూసేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే రాబోయే కాలంలో హిండన్ బర్గ్ గతంలో పరిశోధనలు ఎలా నిర్వహించిందో తమ మోడల్ అందరికీ తెలిసేలా వీడియోలు చేస్తానని చెప్పుకొచ్చాడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్