నాటు నాటు సాంగ్ తో ఆ టీమ్ మొత్తం మరోసారి పాపులర్ అయ్యారు. దీంతో ఆ టీమ్ లోని వ్యక్తులు ఏ పని చేసినా సోషల్ మీడియా లో ఫుల్ క్రేజ్ వస్తోంది. తాజాగా ఆ సాంగ్ సింగర్ రాహుల్ నెట్టింట కలకలం రేపుతున్నారు. అమ్మాయితో ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ఈ ఫోటోలను హీరోయిన్ అషూ రెడ్డి పోస్టు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా పోస్టుపెట్టారు. ఈ పోస్టులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఫోటోలు షేర్ చేసింది. దాంతో చాలాకాలం తర్వాత మళ్ళీ వారి ఎఫైర్ రూమర్స్ కి ఆజ్యం పోశాయి. ఈ ఫోటోల్లో రాహుల్ తో మితిమీరిన చనువు తీసుకుంది అషూరెడ్డి. ఈ ఫోటోలో రాహుల్ చిరునవ్వులు చిందించాడు. మరి వీరి మధ్య ఉన్నదేంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాలి. సింగర్ రాహుల్ తో అషురెడ్డి చర్యలు అనుమానాస్పదంగా ఉంటాయి. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ చాలాకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మొత్తం మీద నాటు నాటు సింగర్ రాహుల్ కు అషూరెడ్డికి ఉన్న రిలేషన్ మీద నెట్టింట కామెంట్లు చకచకా పడుతున్నాయి.