Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

హౌతీలు అంటే ఎవరు ?

హౌతీలు.. ఒక ఉగ్రవాద సంస్థ సభ్యులు. హౌతీ గ్రూపు 1990లో ఏర్పడింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని హౌతీ గ్రూపు వ్యతిరేకిస్తుంది. హౌతీ గ్రూపునకు పశ్చిమ యెమెన్ గ్రూపు కేంద్రంగా ఉంది. ఇరాన్ తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబెల్స్ కు మద్దతుగా నిలుస్తుంటాయి. ఎర్రసముద్రం ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్ – మండెప్‌పై హౌతీ రెబెల్స్ ఆధిపత్యం మొదట్నుంచీ ఎక్కువగానే ఉంటుంది.

హౌతీ తిరుగుబాటుదారులు దిగువ ఎర్రసముద్రం ద్వారా వెళుతున్న వాణిజ్య నౌకలపై కొంతకాలంగా దాడులు పెంచారు. ఈ దాడుల కారణంగా, ఎర్రసముద్రం వాణిజ్య మార్గం ప్రమాదంలో పడింది. ఎర్రసముద్రం ప్రమాదంలో పడటమనేది చిన్న విషయం కాదు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ వర్గాల కథనం. నిన్నమొన్నటివరకు, హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు వెళ్లే ఓడలను మాత్రమే లక్ష్యంగా చేసుకునేవారు. అంతేకాదు, వివిధ దేశాల జెండాలతో ఇజ్రాయెల్‌కు వెళ్లే నౌకలపై హౌతీలు దాడులు చేసినట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, హౌతీ తిరుగుబాటుదారుల నుంచి ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించిన కొన్ని ప్రైవేటు షిప్పింగ్ కంపెనీలు ఎర్రసముద్రం ద్వారా సరకు రవాణాను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించాయి. అనేక నౌకలు,యూరప్ అలాగే ఆసియా చేరుకోవడానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఆఫ్రికా చుట్టూ తిరిగివచ్చే మార్గానికి ఓటేశాయి. అయితే ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ, ప్రైవేటు షిప్పింగ్ కంపెనీలకు తప్పలేదు.

సూయజ్ కెనాల్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం నిలిపివేయడంతో ఆ ప్రభావం ఎర్రసముద్రం ద్వారా జరిగే సరకు రవాణాపై పడింది. ఫలితంగా ఎర్రసముద్రం ద్వారా జరిగే సరకు రవాణా 35 శాతం తగ్గింది. ఎర్రసముద్రం ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ దారుల ద్వారా సరకు రవాణా చేయడం వల్ల షిప్పింగ్ ఖర్చు పెరిగింది.ఫలితంగా నౌకల ద్వారా జరిగే సరకు రవాణా ఖర్చు ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. ఒకదశలో ఇది మోయలేని భారమైంది.

ఇదిలాఉంటే, షిప్పింగ్ ఖర్చులు పెరగడం వల్ల యూరోప్‌లోని అనేక దేశాల్లో మరోసారి ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. కోవిడ్ నేపథ్యంలో అనేక యూరోపియన్ దేశాలు ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొన్నాయి. దాదాపుగా రెండేళ్ల కిందట ద్రవ్యోల్బణం నుంచి అనేక యూరోపియన్ దేశాలు బయటపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్నాయి. ఈనేపథ్యంలో సంభవిస్తున్న పరిణామాల పట్ల ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలాఉంటే, రష్యన్ నౌకలు ఎర్ర సముద్రం ద్వారా ఉచిత నావిగేషన్‌ను అందిస్తున్నాయి. రష్యా నౌకలు నల్ల సముద్రం ద్వారా ఆసియాకు ప్రయాణించి, సూయజ్ కెనాల్ అలాగే ఎర్ర సముద్రం గుండా వెళ్లి హిందూ మహాసముద్రంలోకి ఎంటరవుతాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై యూరప్ అలాగే అమెరికా ఆంక్షలు విధించాయి. అంతిమంగా ఈ పరిణామం ఆసియా, భారత్‌లోని రష్యా మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే ఆసియా, భారత్‌లోని మార్కెట్లను వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. ఎందుకంటే రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఆసియా, భారతే కొనుగోలు చేస్తాయి.

ఎర్రసముద్రం పరిణామాలు తక్షణ భవిష్యత్తులో అంతర్జాతీయ రవాణా అలాగే నౌకల భద్రతపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తాయి. ఎర్రసముద్రం గుండా వెళుతున్న నౌకలపై హౌతీ దాడులను ఆపడానికి అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్, బహ్రెయిన్ వంటి దేశాలు ప్రయత్నించాయి. ఇదిలాఉంటే, ఈ ఏడాది కొత్త సంవత్సరం మొదటి రోజున కనీసం 10 మంది హౌతీ తిరుగుబాటుదారులను అమెరికా సైన్యం హతమార్చింది.అంతేకాదు మూడు హౌతీ నౌకలను కూడా విధ్వంసం చేసింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఎర్రసముద్రం గుండా స్వేచ్చగా సరకుల రవాణాను నిలువరించలేకపోతోంది అగ్రరాజ్యమైన అమెరికా.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్