Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఏపీలో పెన్షన్ కష్టాల వల్ల ఏ పార్టీకి ఎదురు దెబ్బ ?

    ఏపీలో పెన్షన్ దారులు మండుటెండలో గగ్గోలు పెడుతున్నారు. ప్రతినెలా ఒకటో తారీఖున అందాల్సిన పెన్షన్ అందక.. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎర్రని ఎండలో రావాల్సి వచ్చిందని వాపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పై జరుగుతున్న రాజకీయం తమను కష్టాల్లో నెట్టిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా .. పింఛను దారుల సానుభూతికోసం కుట్ర సాగిస్తోందని తెలుగుదేశం పార్టీ విరుచుకు పడుతున్నా.. ఎండలో కన్నీరు పెడుతూ మండి పడుతున్న వృద్ధులు, వికలాంగుల తిట్లు.. ఎన్నికల్లో టీడీపీకి బ్యాక్ ఫైర్ అవుతుందా?

ఎండలు.. .ఎన్నికల కన్నా… ముందు.. పింఛన్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు … ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పింఛన్ పంపిణీ విధులనుంచి దూరం పెట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను దారులు దాదాపు 66 లక్షల మంది సామాజిక పెన్ష్ దారులు ఉన్నారు. వీరందరికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని తెలిసి చాలా మంది ఉదయం నుంచీ సచివాలయాల ముందు క్యూ కట్టారు. ఎండల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలవద్ద పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం అన్నిజిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.అలాగే వికలాంగులు, అనా రోగ్యంతో ఉన్నవారు. నడవలేని వృద్ధులు, మంచం, వీల్ ఛైర్లకే పరిమితమైనవారి తప్పని సరిగా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ లో పింఛన్ల పంపిణీకి కొత్తమార్గదర్శికాలు సూచిస్తూ.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లను ఉదయం 9 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ పంపిణీ చేయాలని 6వ తేదీకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పింఛన్లు అందుకునేందుకు ఉదయాన్నే గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చిన పింఛన్ దారులు కష్టాలు పడ్డారు. చాలా మంది తమ కుటుంబసభ్యులను మంచాల మీద, వీల్ చైర్ లలోనూ గ్రామ సచివాలయాలకు తీసుకువచ్చారు. చాలా చోట్ల పింఛన్ దారులు మీడియాతో.. క్యూలో ఉన్నవారితో తమ కష్టాలు వెళ్ల బోసుకున్నారు. వాలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే తమ వద్దకు వచ్చి పింఛన్లు ఇచ్చేవారని కడపజిల్లా పులివెందులలో పింఛన్‌దారులు చెప్పారు. ఇప్పుడు అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కారణమైన వారికి తమ ఉసురు తగులుతుందని దుమ్మెత్తి పోశారు. వాలంటీర్‌ వ్యవస్థను నాశనం చేయడం వల్ల తాము ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చిందని వృద్ధులు వాపోయారు. కార్యాలయాల వద్దకు వికలాంగులు ఆటోల్లో వెళ్ళాల్సి వస్తోందన్నారు. వాలంటీర్ల ద్వారా మళ్లీ పింఛన్లు పంపిణీ చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని వారు కోరారు.

ఒక పక్క పెన్షన్ దారులు కష్టపడుతుంటే… ఈ అంశంపై తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేస్తున్నారు మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా పించన్‌దారులను సచివాలయాల వద్ద మండుటెండలో ఎండ బెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందన్నారు. నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విమర్శిం చారు. ఖజానాలోని మొత్తం 13 వేల కోట్ల రూపాయలు తన అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని జగన్‌పై జ్యోతుల మండిపడ్డారు. టీడీపీ నీచ రాచ రాజకీయాల కారణంగానే పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పెన్షన్ దారుల సానుభూతి కోసం వైసీపీ రాజకీయం చేస్తున్నా… టీడీపీ నాయకులు విమర్శించినా.. సరైన సమయానికి పెన్షన్ అందక అల్లాడుతున్న వృద్ధులు, సామాన్యుల తిట్లు, శాపనార్థాలు.. ఏ పార్టీకి ఎదురు దెబ్బ గా మారతాయో ….

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్