28.2 C
Hyderabad
Tuesday, May 28, 2024
spot_img

ఆకాశంలో సగం అవనిలో సగం అవకాశాల్లో ఎక్కడ ?

    ‘ఆకాశంలో సగం అవనిలో సగం’ అనే మహిళల నినాదానికి ఎంతమేరకు న్యాయం జరిగిందనే అంశం ఇప్పటికీ పెద్ద చర్చనీయాంశంగానే ఉంటుంది. అయితే మహిళలకు సమాజంలో పురుషులతోపాటు సమానంగా హక్కులు… అవకాశాలు దక్కాయా అంటే అది ఇప్పటికే ఒక ప్రశ్నగానే మిగిలింది. లింగ వివక్ష లేని సమాజాన్ని తయారు చేయ డానికి శతాబ్దాలుగా మేథావులు, సంఘసేవకులు ఎంతోమంది విశేషంగా కృష్టి చేశారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం … స్వాతంత్య్రానంతరం పరిశీలిస్తే పురుషాధిక్య సమాజంలో మహిళలు వేల ఏళ్ల నాటి నుండి వెనకబడే ఉన్నారు. అయితే 21వ శతాబ్దంలో మాత్రం మహిళలు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభపాటవాలను చాటి సమాజ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

    వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి ఆవిర్భవించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తోంది. 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అయితే సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా డిక్లరే షన్‌ను అనుసరించి 1909న యునైటెడ్ స్టేట్స్‌లోమొదటి జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది. 1910లో, కోపెన్‌హాగన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సందర్భంగా, క్లారా జెట్‌కిన్ మహిళల హక్కులు ఓటు హక్కు కోసం వాదించేందుకు వార్షిక మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఏకగ్రీవ మోదంతో 1911లో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ స్విట్జర్లాండ్‌లో మిలియన్ల మంది మహిళాదినోత్సవాన్ని జరుపుకోవడానికి దారితీసింది.

    రష్యా విప్లవానంతరం 1917 తర్వాత జరిగిన పరిణామాల్లో రష్యా మహిళలు ”ఆహారం – శాంతి” గురించి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీంతో అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులు కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ మారింది. ఈ ఏడాది మనం జరుపుకునేది 111 వ అంతర్జాతీయ దినోత్సవం…

     ప్రంపచ వ్యాప్తంగా మహిళా సాధికారత మాట ఎలా ఉన్న మనదేశంలో మాత్రం మహిళా సాధికారత నూటికి నూరుశాతం సాధ్యపడలేదనేది వాస్తవం. ఈ దిశలో ఇటీవల లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఆకాశంలో సంగం అవనిసంగంలో అని కవితాత్మకంగా చెప్పడానికే తప్ప వాస్తవి కంగా అవకా శాల్లో సగం అనేది ఇప్పటికీ శూన్యమే…పురుషులతోపాటు సమాన సంఖ్యాబలం ఉన్న స్త్రీలకు ౩౩ శాతం రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా కల్పించడం అనేది మహిళలకు తీరని ద్రోహమే. అసలు పురుషుల తోపాటు సమాన సంఖ్యాబలం ఉన్న మహిళలకు సమాన హక్కులు దక్కాలి…కానీ ఒకరి దయాదాక్ష ణ్యాల మీద ఇప్పటికీ ఆధారపడడం ఏ విధంగా ఇది మహిళా సాధికారత అవుతుందని ఒక పక్క మహి ళా మేథావులు …. సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

      అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఏటా మార్చి 8న జరుపుకుంటారు. మహిళలు సాధించిన విజయాలను గౌరవించడానికి, సమాజానికి వారు చేసిన సేవలను గుర్తించడానికి ఈ రోజును ఒక వేదికగా మార్చుకున్నారు. మహిళా సాధికారతపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఒకచోట చేరి లింగవివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతూ…మహిళలు ముందుకు ఎలా సాగాలో… ఎలా పురోగమించాలో ….ప్రణాళికలతో అభివృద్ధి పథంలోకి పమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని సంకల్పించుకున్నారు. ఎందుకంటే ఇంటి పనుల నుంచి వ్యవస్థ లోని అన్ని రంగాల్లో వారి నైపుణ్యాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. సమాజంలో దేశంలో స్త్రీ లేకుండా అభివృద్ధి అసాధ్యమని సామాజిక వేత్తలు తేల్చి చెబుతున్నారు.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్