యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ, క్రేజీ మూవీ వార్ 2 లో నటిస్తున్నాడు. మరో వైపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వార్ 2 షూట్ ఎండ్ అయ్యేది ఎప్పుడు..? ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో షూట్ స్టార్ట్ చేసేది ఎప్పుడు..?
దేవర మూవీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నారు. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఆమధ్య ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల పై భారీ యాక్షన్ ఎపిసోడ్, ఓ సాంగ్ షూట్ చేశారని తెలిసింది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. షూటింగ్ చివరి దశకు చేరుకుందట. ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్ కూడా దాదాపు పూర్తయ్యిందని తెలిసింది.
ఎన్టీఆర్ డేట్స్ కోసం.. ప్రశాంత్ నీల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా రెడీ అయ్యిందట. ఈ నెల 20 నుంచి ఎన్టీఆర్ తో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇందులో ఎన్టీఆర్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడని.. ఇంత వరకు ఎన్టీఆర్ నటించని పాత్రలో కనిపిస్తాడని టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. మేకర్స్ మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2026 జనవరి 9న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మరి.. అనౌన్స్ చేసినట్టుగా జనవరి 9న వస్తుందో.. వాయిదా పడుతుందో.. చూడాలి.