Medak |సంబరాలు నింపాల్సిన హోలీ పండుగ ఓ కుటుంబంలో విషాదం నింపింది. రంగులతో సంతోషంగా జరగాల్సిన హోలీ.. కన్నీళ్ల ధారలను ప్రవహించేలా చేసింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లిలో అంజయ్య అనే వ్యక్తి షబ్బీర్ అనే వ్యక్తిపై రంగు పోసేందుకు వెంటపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన షబ్బీర్.. అంజయ్యపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారు అంజయ్యను కాపాడి.. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న.. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు షబ్బీర్ కు అంజయ్యకు మధ్య పాత కక్షలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.