తన భర్త చేసిన తప్పేంటని నందిగం సురేష్ భార్య బేబీలత ప్రశ్నించారు. తన భర్తను అరెస్టు చేశారని తెలుసుకున్న ఆమె.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తన భర్తకు ఏమైనా జరిగితే చంద్రబాబుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని అన్నారు. మాజీ సీఎం జగన్‌పై అబద్దాలు చెప్పాలని..పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో…తన భర్త తప్పు చేశాడని అనడానికి ఆధారాలు ఉన్నాయా? అని నిలదీశారామె.