స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ గణేష్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గణేష్ నిర్మాణంలో అన్ని శాఖలు ప్రతి సంవత్సరం మాదిరి సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా.. పర్యావరణానికి హానీ కలుగకుండా నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడిపై సీఎం కేసిఆర్ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నరని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వినాయక విగ్రహం 61 అడుగులు ఉంటుందని వివరించారు. త్వరలోనే స్వామి వారు ఏ రూపంలో దర్శనం ఇస్తారు అనేది వెల్లడిస్తామన్నారు.