కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ప్రతి ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆమె కట్టుకుంటున్న చీరలు హైలైట్ అవుతున్నాయి. ఆమె ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్రానికి చెందిన చీరను ధరిస్తున్నారు.
శనివారం ఉదయం ముందుగా ఆమె ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి భవనానికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ఈ సందర్బంగా ఆమె కట్టుకున్న చీర ఆకట్టుకుంది. ఆమె కట్టుకున్న చీరపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆమె కట్టుకున్న చీర ఏంటి.. అది ఏ కళకు చెందినది… అనే దానిపై ఆసక్తి పెరిగింది.
నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరపై ప్రింట్ చాలా అందంగా కనిపించింది. క్రీమ్ వైట్ కలర్ చీర మీద నల్ల రంగుతో ఉన్న చిత్రాలు ఆకర్షణీయంగా కనిపించాయి. ఇక ఈ చీర సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ చీర గురించి చెప్పాలంటే బీహార్‌లోని మధుబని కళకు సంబంధించిన చీర ఇది. ఈ చీరను 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చారు. ఆమె ఇచ్చిన చీరనే శనివారం బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కట్టుకున్నారు. ఈ చీరలో ఆమె అందంగా ఉన్నారు.
దులారి దేవి నైపుణ్యానికి, మధుబని కళకు ప్రాముఖ్యతను ఇస్తూ ఈ చీరను కట్టుకున్నారు. గతంలో మిథిలా ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఓ యాక్టివిటీ కోసం ఎఫ్‌ఎం మధుబనిని సందర్శించారు నిర్మలా సీతారామన్.
ఆ సమయంలో నిర్మలా సీతారామన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవిని కలుసుకున్నారు. బిహీర్‌లోని మధుబని కళ ప్రత్యేకతను అప్పుడే తెలుసుకున్నారామె. ఈ క్రమంలోనే దులారి దేవి తాను స్వయంగా తయారు చేసిన చీరను నిర్మలకు బహుమతిగా ఇచ్చారు.
బడ్జెట్ రోజు ఈ చీరు కట్టుకోవాలని దులారాదేవి కోరినట్టు తెలుస్తోంది. ఆమె కోరిక మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఆ చీరను ధరించారు. మధుబని చీరలన్నీ ఖరీదు ఎక్కువేనట. ఈ చీర ఖరీదు కూడా వేల రూపాయలు ఉంటుందట.
నిర్మలా సీతారామన్ ప్రతి ఏడాది ఒక రాష్ట్రానికి చెందిన కళకు సంబంధించిన చీరను కట్టుకుంటున్నారు. గత 8 ఏళ్లుగా నిర్మలా సీతారామన్ వివిధ చీరలను కట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది టస్సర్ సిల్క్ శారీపై కాంతా హ్యాండ్ వర్క్ చీరను ధరించారు నిర్మలా సీతారామన్.