19.8 C
Hyderabad
Monday, February 10, 2025
spot_img

నడవడం మర్చిపోయా- సునీతా విలియమ్స్‌

సునీతా విలియమ్స్..యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ మూలాలున్న అమెరికా వ్యోమగామి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా)లో వ్యోమగామిగా ప్రపంచానికి విశేష సేవలందిస్తున్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆమె గురించే ఆందోళన పడుతోంది. సునీతా విలియమ్స్ కొంతకాలం కిందట మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు. సునీత వెంట సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయారు. ఆమె ఎప్పుడు భూమిమీదకు తిరిగి వస్తారన్న విషయమై ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు.

కాగా తాజాగా అంతరిక్షం నుంచి విద్యార్దినీ, విద్యార్థులతో సునీతా విలియమ్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి జీరో గ్రావిటీ వద్ద గడపడంతో , అసలు నడక అనేది ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు సునీతా విలియమ్స్. ఇంతకాలంగా అంతరిక్షంలో తాను నడవలేదన్నారు. అలాగే కూర్చోనూ లేదన్నారు.

కాగా దాదాపు ఏడు నెలల కిందట బోయింగ్ స్టార్‌లైనర్ లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ లను భూమికి తీసుకురావడానికి సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేర్కొన్నారు. అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమి పైకి తీసుకురావడానికి జో బైడెన్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదని ట్రంప్ పేర్కొన్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. బైడెన్ ప్రభుత్వం అసమర్థత కారణంగా ఇద్దరు వ్యోమగాములు అనేక ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్ అన్నట్లు మస్క్ చెప్పారు. ఈ విషయంలో స్పేస్ ఎక్స్ సహాయాన్ని ట్రంప్ కోరారన్నారు. అధ్యక్షుడు ట్రంప్ విన్నపం మేరకు త్వరలోనే సునీతా విలియయ్స్ , బుచ్ విల్మోర్ ను భూమి పైకి తీసుకువచ్చే పని చేస్తానన్నారు ఎలన్ మస్క్‌.

స్టార్‌ లైనర్ .. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ సంస్థ ప్రయోగాత్మకంగా తొలిసారి చేపట్టిన మానవసహిత రోదసీ యాత్ర. అరుదైన ఈ రోదసీ యాత్రలో సునీతా విలియమ్స్ భాగస్వామి అయ్యారు. ఇందులో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. ఇక్కడో విషయం గమనించాలి. స్టార్‌లైనర్ ప్రయోగానికి ఒక షెడ్యూల్ అంటూ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ వారం రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉండి కిందటేడాది జూన్‌ 13న స్టార్‌లైనర్‌లో వెనక్కి రావాలి. మర్నాడు అంటే జూన్‌ 14న భూమికి చేరుకోవాలి. అయితే ముందుగా చెప్పుకున్నట్లు స్టార్‌లైనర్ కు మరమ్మతులు జరిగాయి కానీ అవి తాత్కాలికమే. పూర్తిస్థాయిలో రిపేర్లు జరగలేదు. దీంతో సునీత, బుచ్ ఇద్దరూ అంతరిక్షకేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరూ లేకుండానే స్టార్‌లైనర్ భూమిపైకి వచ్చింది. అయితే అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకురావడానికి ప్రస్తుతం నాసా కసరత్తు చేస్తోంది. దీంతో మరో వ్యోమనౌకను సిద్దం చేసే పనిలో పడ్డారు నాసా అధికారులు. నాసా వర్గాల కథనం మేరకు ఆమె భూమిపైకి రావడానికి మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే దాదాపు ఏడు నెలలుగా అంతరిక్షకేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సునీతా విలియమ్స్ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందంటున్నారు సైంటిస్టులు. ఎందుకుంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. ఈ ప్రభావం రక్తపోటు నియంత్రణపై పడుతుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా శరీరంలోని ఎముకల సాంద్రత ….అదే బోన్ డెన్సిటీ తగ్గుతుంది. వెన్నెముక, తొడ ఎముక, పొత్తి కడుపు ఎముకల బరువు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎముకల బరువు తగ్గడమే కాదు… కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.శఏమైనా సునీతా విలియమ్స్ రాక కోసం యావత్ భూగోళం వేయి కళ్లతో కాదు కాదు…..లక్ష ….కోట్ల కన్నులతో ఎదురుచూస్తోంది.

Latest Articles

అర్జెంటినాలో అధికారులు అర్జంట్ గా చేస్తున్న పని ఏమిటో తెలుసా…? సరండీ నది సరౌండింగ్స్ క్లీనింగ్ కు ప్లానింగ్

పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు...ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్