సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. అర్హులైన వారందరికీ పథకాలు అమలు చేస్తామని చెప్పి…. అందులో 3 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చకపోవడం బాధాకరమని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సర్కారు విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో 70లక్షల మందికి రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా 20 వేల కోట్లను జమ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు ఇస్తామని చెప్పారని తెలిపారు. 40 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు , సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని లేఖలో తెలిపారు బండి సంజయ్.