Free Porn
xbporn
24.7 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

ముస్లీంల రిజర్వేషన్ల రద్దు వెనక బీజేపీ వ్యూహం ఏమిటి?

   ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ల అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారానికి వస్తే ముస్లింలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కుండబద్దలు కొట్టారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తమ వాదనకు మద్దతుగా వివరణ కూడా ఇచ్చారు. రద్దయ్యే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను వెనుకబడిన తరగతుల కోటాలో కలుపుతామన్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల కిందట చేవెళ్ల బహిరంగ సభలోనూ ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయ డాన్ని తప్పు పట్టారు. అమిత్ షా అక్కడితో ఆగలేదు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేసి, రాజకీయ లబ్ది కోసమే బీజేపీయేతర ప్రభుత్వాలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాయని విమర్శలు సంధించారు. కర్ణాటకలో గతంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉండేవి. అయితే బస్వరాజ్ బొమ్మై నాయకత్వంలో బీజేపీ సర్కార్ వచ్చాక ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. బస్వరాజ్ బొమ్మై సర్కార్ ఈ నిర్ణయం తీసుకునేనాటికి కర్ణాటకలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉంది. సహజంగా కమలం పార్టీకి ఎప్పుడూ అండగా ఉండే లింగాయత్ సామాజికవర్గం నారాజ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కులాలకతీ తంగా హిందూ ఓటు బ్యాంకును కమలం పార్టీ వైపు మళ్లించడానికే ముస్లింల రిజర్వేషన్లను బొమ్మై సర్కార్ రద్దు చేసిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.

వాస్తవానికి మనదేశంలో ముస్లిం సమాజం దారుణ పరిస్థితుల్లో ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముస్లిం సమాజం బాగా వెనుకబడింది. రోడ్ల మీద పండ్లు,పల్లీలు అమ్ముకునే వాళ్లు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్లు, మోటార్ మెకానిక్కులు. ఇలా రెక్కల కష్టం మీద బతికేవాళ్లలో ఎక్కువమంది ముస్లింలే కనిపిస్తారు. అంతేకాదు ఐఏఎస్‌,ఐపీఎస్ అధికారులకు డ్రైవర్లుగానూ , వారి ఇళ్లల్లో తోటమాలీలుగానూ పనిచేసేవాళ్లలో ఎక్కువ మంది ముస్లింలే ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో 2005లో ఓ కమిటీని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2006లో సచార్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. అదే ఏడాది నవంబరు 30న సచార్ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం.

భారతీయ ముస్లిం సమాజం వెనుకబాటుతనంపై జస్టిస్‌ రాజేందర్ సచార్ కమిటీ సాధికారికంగా అధ్యయనం చేసింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు 14 శాతానికి పైగా ఉన్నారు. అయితే అధికార యంత్రాం గంలో ముస్లింల శాతం కేవలం 2.5 మాత్రమే. దళితులు, ఆదివాసీలతో పోలిస్తే దారుణ పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నా రని సచార్ కమిటీ తేల్చి చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే అనేకరంగాల్లో భారతీయ ముస్లింల వెనుకబాటు తనాన్ని జాతీయదృష్టికి తీసుకువచ్చింది సచార్ కమిటీ. చదువు లేకపోవడమే ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్య లకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. దీనికోసం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌కు సూచించింది.బాలికా విద్యపై దృష్టి పెట్టాలని కేంద్రానికి సూచించింది సచార్ కమిటీ. ముస్లిం బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నది సచార్ కమిటీ చేసిన మరో సిఫార్సు. అలాగే ముస్లింల సామాజిక అభివృద్ధి కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల్లో మైనారిటీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సచార్ కమిటీ సూచించింది.

ముస్లిం సమాజం మేలు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ.అయితే వీటిలో అమలుకు నోచుకున్నవి అరకొర సిఫార్సులే. మిగతావన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఆర్థికంగా ముస్లింలను ఆదుకోవడానికి గ్యారంటీ లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సచార్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సును బ్యాంకర్లు తోసిపుచ్చారు. గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం అంటే సముద్రంలో పైసలు విసరడంతో సమానమని బ్యాంకర్లు వెటకారమాడారు. అంతేకాదు జాతీయస్థాయి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కొంతకాలంగా నిధులు ఇవ్వడం ఆపివేసింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు ముస్లింలలో అత్యంత వెనుకబడిన పస్మందాలను ఆదుకోవడానికి ప్రత్యేక పథకాలు రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుంటారు. మరోవైపు అసలు ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా బహిరంగంగా ప్రకటిస్తుం టారు. ముస్లిం సమాజానికి సంబంధించి బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ? కారణాలేమైనా ప్రస్తుతం భారతీయ ముస్లిం సమాజం సమస్యల చౌరస్తాలో నిలబడి ఉందన్నది వాస్తవం.

Latest Articles

అక్టోబర్ 25న రాబోతున్న ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్