కాకినాడ సమద్ర తీరంలో ఇండో అమెరికన్ సంయుక్త నావికాదళ విన్యాసాలు జరుగుతున్నాయి. టైగర్ ట్రయాంప్ -2024 పేరుతో భారత్-అమెరికా నేవి జాయింట్ ఆపరేషన్ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ఇండియా రక్షణదళాలు, అమెరికా రక్షణాదళాలకు చెందిన 800 మంది అధికారులు పాల్గొం టున్నారు. ఇరుదేశాలు యుద్ధనౌకలు యుద్ధ ట్యాంకర్లతో చేస్తున్న ప్రదర్శనలు ఆకట్టుకుంటు న్నాయి. దేశ రక్షణ, సముద్రమార్గం ద్వారా శత్రువులు అటాక్ చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై విన్యాసాల ద్వారా చూపిస్తున్నారు. ఈ నెల 31 వరకు జరగనున్న నావికదళ విన్యాసాల్లో భారత్ నుండి ఐఎన్ఎస్ ఐరావత్, కేసరి యుద్ద నౌకలు పాల్గొంటున్నాయి.అలాగే అమెరికా నుండి యూఎస్ఎస్ సోమర్ సెట్ నౌక పాల్గొంది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలు.. దాయాది దేశాల సైన్యం చొరబడి నప్పుడు ప్రదర్శించే యుద్ద తంత్రాలపై విన్యాసాల ద్వారా కళ్లకుగట్టినట్టు చూపిస్తున్నారు. ఈ కార్య క్రమం లో నేవి అధికారి రాజేష్ ధనకర్,ఆర్మీ అధికారి అఖిలేష్ కుమార్, యూ.ఎస్.నేవి అధికారి మార్టినేజ్, యూఎస్ కౌన్సిల్ జనరల్ జన్నిఫర్ లార్సన్ పాల్గొన్నారు.


