21.2 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం – కేటీఆర్‌

ఆశా వర్కర్లపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటి దుర్మార్గం అంటూ ప్రశ్నించారు. ఆశా వర్కర్ల ఆందోళనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా? అంటూ మండిపడ్డారు. ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారని నిలదీశారు. దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా? అంటూ నిప్పులు చెరిగారు.

హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్ళంటే అంత చులకనా? అంటూ కేటీఆర్ అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా? అంటూ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్