D. K. Aruna | ఈటల రాజేందర్ మాట్లాడింది నూటికి నూరుశాతం వాస్తవమేనని బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ… బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ సహకరించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కి అనుకూలంగా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటి..? అంటూ మండిపడ్డారు. అసలు వాస్తవాలు మాట్లాడితే.. రేవంత్ కు ఎందుకు అంత ఉలిక్కిపాటు? అంటూ నిలదీశారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.