Nara Lokesh | వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ యువనాయకుడు నారా లోకేష్. మా జోలికి వస్తే.. వైసీపీ నేతలకు గుండు కొట్టిస్తానని హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్ కు మండిపడ్డ లోకేష్.. వైసీపీ నేతలకు మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వ తీరుపై అనుక్షణం విమర్శలు గుప్పిస్తున్న సీఎం.. అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా? అంటూ ప్రశ్నించారు. ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయంపై మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం.. అన్నా క్యాంటిన్ ని తీసేసి సచివాలయంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా కూడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ.. అన్నా క్యాంటిన్ లను ఇలా సచివాలయాలుగా మార్చి.. పార్టీ రంగులు వేసుకుంటారా? అని మండిపడ్డారు. ఇంకెన్ని రోజులు ఈ స్టిక్కర్ల బతుకు అంటూ తనదైన రీతిలో మండిపడ్డారు లోకేష్.