18.7 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

Viveka Murder Case: ఆ రోజు వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు

మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)ని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు హార్డ్ డిస్క్ లో వీడియోగ్రఫీ, ఆడియోలు హైకోర్టుకు సోమవారం సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. మంగళవారం సీబీఐ ఎదుట హాజరుకావాలని అవినాశ్ రెడ్డికి ఉత్తర్వులు జారీచేసింది. కాగా వివేకా హత్య కేసులో సీబీఐ తనపై తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అవినాశ్((Avinash Reddy)) దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తీవ్రమైన చర్యలంటే ఏంటని అవినాశ్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా?అని ధర్మాసనం పేర్కొంది. విచారణలో చెప్పింది చెప్పినట్లు వాంగ్మూలం చేస్తున్నారన్న నమ్మకం లేదని అవినాష్‌ న్యాయవాది వెల్లడించగా.. విచారణ వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు.

Read Also: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం కొత్త తేదీ ఖరారు
Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్