తిరుమలలోని విశాఖ శారదాపీఠాన్ని వెంటనే సీజ్ చేయాలని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. శారదాపీఠం టీటీడీ రూల్స్‌ను ఉల్లంఘించిందన్నారు. శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తులో కట్టడాలు చేపట్టారని అన్నారు. శారదాపీఠం భవనానికి వెనుక వాగును కబ్జాచేసి అక్రమ నిర్మాణం చేపట్టారని సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. తిరుమలలో 80 శాతం మఠాలు ముఠాలు గా ఏర్పడి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్పందించలేదని విమర్శిం చారు. దళారీలపై చర్యలు తీసుకోకపోతే దీక్షలకు వెనుకాడం అని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ హెచ్చరించారు.


