ఈనెల 17న సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 48వ మహా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్ష కార్యదర్శులు రాఘవరెడ్డి, శశిధర్‌లు చెప్పారు. ఈనెల 7న ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలు 17తో ముగుస్తుండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలోని 18 శాఖల సమన్వయంతో ఈ ఏడాది నిమజ్జల కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వ ముందరడం హర్షనీయమని అన్నారు.