దర్శకుడు విక్రమ్ కె కుమార్ చేతుల మీదుగా ‘తికమకతాండ’ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. తికమక తండా దర్శకుడు వెంకట్ హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్లు యాని, రేఖ నిరోష విక్రమ్ కె కుమార్‌ను కలిసి ట్రైలర్ చూపించి లాంచ్ చేయించారు. ట్రైలర్ చూసిన విక్రమ్ కె కుమార్ తమను అభినందించినట్లు మూవీ టీమ్ తెలిపారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడానికి మూవీ టీం సిద్ధమయ్యారు. తికమకతాండ సినిమాను డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వెంకట్ ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ నిరోషలకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే వెంకట్‌కి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకుడు : వెంకట్
నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్
తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష
కథ : నిరూప్‌కుమార్
డి ఓ పి : హరికృష్ణన్
ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్
సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి
పి ఆర్ ఓ : మధు వి ఆర్