హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనాలు రావడం, అలాగే హంగ్ ఏర్పడే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు వెల్లడించడంతో.. అధిష్టానం పక్కా ప్లాన్ వేసింది. గెలిచే అభ్యర్థులు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దించింది. డీకే శివకుమార్ ప్లాన్ ఏంటి? అసలేం జరగబోతోంది అనే విషయాలను కింది వీడియోలో చూడగలరు.