Vijayawada |విజయవాడలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు శశిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ ను బెజవాడకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రైమ్ కేసులో శశిని ఏ4 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. శశి అరెస్ట్ తో కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకి చేరింది. శశి ఇచ్చిన వివరాలతో బెంగుళూరులో ఒక పోలీస్ టీం మకాం వేసి విచారణ సాగిస్తుంది. ఈ కేసులో మరో నిందితుడు శేషు కోసం పోలీసుల గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
Read Also: హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
Follow us on: Youtube, Instagram, Google News