స్వతంత్ర వెబ్ డెస్క్: మళ్లీ విజయం మనదే ఎవరు తొందరపడొద్దని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కీలకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి కార్యకర్తతో మాట్లాడాలి. ప్రతి కార్యకర్త దగ్గరకు అభ్యర్థి వెళ్లాలి. కోపతాపాలు పక్కనపెట్టి సమన్వయంతో ప్రచారం చేపట్టాలి. మళ్లీ విజయం మనదే. ఎవరు తొందరపడొద్దు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అని ఎమ్మెల్యే అభ్యర్థులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ 51 మంది అభ్యర్థుల కు బి ఫారాలు ఇస్తాం..మిగతా వారికి రేపు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే అభ్యర్థులు కోపాలను తగ్గించుకొని… చిన్న కార్యకర్త అయినా వెళ్లి కలవాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతుప్త నేతలను ఎక్కువగా బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదేనని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. మంచి రోజులు లేవని…ఇవాళ ఉదయం నుంచి నేను బి ఫారాలపై సంతకాలు పెట్టానన్నారు.