స్వతంత్ర వెబ్ డెస్క్: 51 బీ ఫాంలు మాత్రమే రెడీ అయ్యాయి మిగతా బీ ఫాంలు సిద్ధమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మళ్లీ విజయం మనదే ఎవరు తొందరపడొద్దని కోరారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కోపతాపాలు పక్కనపెట్టి సమన్వయంతో ప్రచారం చేపట్టాలి. మళ్లీ విజయం మనదే. ఎవరు తొందరపడొద్దు. సాంకేతికంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి’ అని ఎమ్మెల్యే అభ్యర్థులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ 51 మంది అభ్యర్థుల కు బి ఫారాలు ఇస్తాం..మిగతా వారికి రేపు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే అభ్యర్థులు కోపాలను తగ్గించుకొని… చిన్న కార్యకర్త అయినా వెళ్లి కలవాలని ఆదేశించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ చేశామని…. భరత్ కుమార్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. సమస్య ఏమైనా ఉంటే 9848023175 నంబర్‌కు కాల్ చేయాలి.. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు సీఎం కేసీఆర్.
ఇవాళ 51 బీ ఫాంలు మాత్రమే ఇస్తున్నా- సీఎం కేసీఆర్
0
316
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


