అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీది విష ప్రచారం అని అన్నారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైకాపా మూకలేనని తెలిపారు. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారని చెప్పారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.