స్వతంత్ర వెబ్ డెస్క్: రెండేళ్ల క్రితం అందరినీ భయపెట్టిన కొవిడ్-19(Covid-19)ను ఇప్పుడు సాధారణ జ్వరంగా(Fever) ప్రజలందరూ భావిస్తున్నారు.. అయితే ఆ జ్వరం మామూలుదే అని లైట్ తీసుకుని సాధారణ టాబ్లెట్లు వేసుకుంటున్నారు చాలామంది. అయితే జ్వరాలను సీరియస్ గా తీసుకోవాలని, ఇది ప్రాణాలకే ముప్పుగా మారుతోందని హెచ్చరికతో కూడిన రిక్వెస్ట్ చేస్తున్నారు దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula). తమ కుటుంబంలో జరిగింది ఎవరికీ జరగకూడదని భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసారు.
కోవిడ్ తరవాత మన శరీరంలో చాలా మార్పులే వచ్చాయి. ఎంతో మంది ఇప్పటికీ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు(Joint pains), ఏంతిన్నా అజీర్తి చేయడం(indigestion), రోగనిరోధక శక్తి(Immunity Power) బాగా తగ్గిపోవడం వంటి సమస్యలు చాలా మందిలో ఉన్నాయి. దీనికి తోడు బయటికి కనిపించని రోగాలు కూడా కోవిడ్ తరవాత వస్తున్నాయి. అందుకే, ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేయడానికి దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) కూడా ముందుకు వచ్చారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తాము ఏం కోల్పోయామో వెంకీ చెప్పారు.
‘ఇది కేవలం జ్వరం(Fever) కాదు’ అంటూ వెంకీ కుడుముల ఈరోజు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని.. అది మన ప్రాణాలను తీసే భయంకరమైన రోగం కావచ్చని ఆయన హెచ్చరించారు. జ్వరమే కదా అని నిర్లక్ష్యం(Neglect) చేసి డాక్టర్ వద్దకు సకాలంలో వెళ్లని తన కజిన్(Cousin) ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఒక మెసేజ్(Message)ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘నా కజిన్ కొన్ని వారాల పాటు జ్వరంతో బాధపడ్డాడు. ఇది కేవలం జ్వరమే కదా అని సకాలంలో డాక్టర్ వద్దకు వెళ్లలేదు. కానీ అది ఒక అరుదైన జబ్బు సీబీ సిండ్రోమ్‌గా(CB syndrome) మారిపోయింది. దీనికి తోడు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అతడికి సకాలంలో వైద్యం అంది ఉంటే నయం అయిపోయేది. వైద్యం(Medicine) ఆలస్యం కావడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఇది మా కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. కోవిడ్(Covid) తర్వాత ఏ జ్వరమూ కేవలం జ్వరం కాదు.
మీ శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది మిమ్మల్ని జ్వరం(Fever), ఒంట్లో బాగోలేకపోవడమో, ఇతర ఇబ్బందితోనో అప్రమత్తం చేస్తుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే హాస్పిటల్‌కు(Hospital) వెళ్లి పరీక్ష చేయించుకోండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు(Medical tests) చేయించుకోవడానికి దయచేసి సమయం కేటాయించండి. మీకు ఏమైనా తేడాగా అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఆరోగ్యం వైపు వేసే ఒక చిన్న అడుగు జీవితాలను, కుటుంబాలను నిలబెడుతుంది. .’ అని చాలా ఎమోషనల్‌గా వెంకీ కుడుముల(Venky Kudumula) రాసుకొచ్చారు.
వెంకీ కుడుముల పోస్టుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ స్పందిస్తున్నారు. ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. ఈ విషయంలో అందరినీ అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తమ కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని కొంత మంది షేర్ చేసుకుంటున్నారు.
ఇక వెంకీ కుడుముల కెరీర్ విషయానికి వస్తే… ‘ఛలో’(Chalo), ‘భీష్మ’(Bheeshma) వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ , మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ కుడముల(Venky Kudumula). ‘భీష్మ’ తర్వాత నితిన్ – రష్మిక(Nitin – Rashmika) కాంబోలో వెంకీ కుడుముల ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) పతాకంపై ఇది రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది.