22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

ముచ్చటైన మూడు సినిమాల్లో ఏది బ్లాక్ బ్లస్టర్ ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు విడుదలయ్యాయంటే థియేటర్ల సమస్య అనాదిగా వేధిస్తూనే ఉంది. అది పండగ రోజుల్లో అయితే ముదిరి పాకాన పడుతుంది. తాజాగా సంక్రాంతి పండుగకి టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, మరోవైపు లెజండ్ స్టార్ బాలకృష్ణ వీర సింహారెడ్డి తో పాటు, తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలు ప్రధానంగా పోటీపడుతున్నాయి.

అయితే ఇక్కడ విజయ్ హీరోగా రూపొందిన ‘వారసుడు’ సినిమాని తెలుగు నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మించడం, మహర్షి తర్వాత డైరక్టర్ వంశీ పైడిపల్లి సినిమా కావడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు వీరు ముగ్గురికి థియేటర్ల సమస్య వచ్చింది. ముగ్గురు యోధులు కొట్టుకుంటే ఫైట్ రసవత్తరంగా మారుతుంది. అంతేకాదు గెలుపు అంత సులువుగా ఎవరికీ దక్కదు…

విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ముగ్గురి చేతుల్లోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. వారిలో సురేష్ ప్రొడక్షన్స్, అల్లు అరవింద్, దిల్ రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అంతేకాకుండా కొందరు థియేటర్ ఓనర్లు కూడా ఎగ్జిబిటర్లుగా ఉంటారు. వారు కొందరితో టై అప్ అవుతారు. అందుకని వారి చేతుల్లో కూడా ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా కావడంతో, ఎలాగూ బావే కాబట్టి అల్లు అరవింద్ సపోర్ట్ తో థియేటర్లు బ్లాక్ చేస్తారు.

ఇక బాలకృష్ణ సినిమాకి థియేటర్లు ఇవ్వమంటే ఆయన ఊరుకోడు కాబట్టి తప్పదు ఇవ్వాల్సిందే… బహుశా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి దొరికినట్టుగా భావిస్తున్నారు.

ఇక మిగిలింది దిల్ రాజు…ఆయనకి సొంతంగా ఉన్నాయి కాబట్టి, వారసుడు సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇక్కడవరకు ఎవరికీ థియేటర్ల సమస్య లేదు. కానీ రిలీజ్ డేట్ల దగ్గరే పేచీ వచ్చి పడింది. ఎందుకంటే సినిమాలకి కలెక్షన్లు రావాలంటే రిలీజ్ నుంచి అంటే శుక్ర, శని, ఆదివారాలు కీలకం. ఒక్కరే మూడురోజులు గంపగుత్తగా తీసుకుంటారు. దాంతో కలెక్షన్లు అన్నీ వచ్చేస్తాయి.

ఇప్పుడీ ముగ్గురి మధ్యా మొదటి మూడు రోజుల కోసం రచ్చ మొదలైంది. పండగరోజుల్లో సినిమాలకి డిమాండ్ భారీగా ఉంటుంది. అందుకే ‘నేను ముందు’… అంటే ‘నేను ముందు’ అని పోటీ పడ్డారు. అందరి సినిమాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పండగ రేసులో ముందుకి వచ్చారు. ఆయన సినిమా 12న విడుదలవుతుంటే, 13న వాల్తేరు వీరయ్య వస్తుంది. అంటే వీళ్లిద్దరికి ఒక రోజే థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడే ఎంత దక్కితే అంతే. రెండో రోజుకి థియేటర్ల సంఖ్య పడిపోతుంది. వీరయ్య వస్తాడు. ఆయనొక రోజు పండగ చేసుకుంటాడు.

ఇక్కడ చిక్కు ఏమిటంటే, 13,14,15 మూడు పండగ రోజులు. అవి చిరంజీవి తీసేసుకున్నాడు. బాలకృష్ణకి నాలుగు రోజులు వచ్చాయి. కానీ మిగిలింది…దిల్ రాజు…అతను ఒకరోజు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంటే తన వారసుడు సినిమా 14న వస్తోంది. ఇప్పుడు తనకి 14,15,16 తేదీలు ఉంటాయి. చివరి రోజు అంత ఊపు ఉండదు. ఒకవేళ సినిమా అటో ఇటో అయితే దిల్ రాజుకి నష్టం…బాలయ్య, చిరు సేఫ్ గా ఉంటారు. ఇదే ఇక్కడ సమస్య అయ్యింది.

అయితే ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర తగ్గాలి. ఈ పని దిల్ రాజు చేశాడు. తన పేరులోనే దిల్ ని చేర్చుకున్న ఆయన మనసున్న మారాజుగా మారి, సరే, అన్నాడు. అంతేకాదు అనాల్సిన నాలుగు మాటలు హీరో శ్రీకాంత్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి దులిపేశాడు. మొత్తానికి 14న వారసుడు రాబోతున్నాడు.

ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే…ఈ మూడు సినిమాల్లో ఏది బాగుందో దానికే జనం వెళతారు. అది మిగిలిన రెండు సినిమాలపై ఎఫెక్టు పడుతుంది. బాగున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా దానికి తిరుగుండదు. అదే దిల్ రాజు చెప్పాడు.

Latest Articles

నారాయణపేట జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ పర్యటన

నారాయణపేట జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌, ఎంపీ డీకే అరుణ పర్యటించారు. సర్వ మండలం రాయికోడ్‌ గ్రామంలో అంగన్వాడీ సెంటర్‌, పల్లె దవఖానాను సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం,పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్