జెమిని టీవీ సీరియల్లో నటించే బుల్లితెర తారలు నగరం నలు మూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా సందర్శించి.. గణేష్ పూజలో పాల్గొని.. అక్కడ నిర్వాహకులను, భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 19 నుండి నిమజ్జనం జరిగే రోజు వరకు తొమ్మిది రోజులు పాటు జరుగుతుంది.
మహిళా ప్రేక్షకుల అభిమాన బుల్లితెర తారలంతా గణేష్ మండపాలకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో గణేష్ మండపాలలో దర్శించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని బుల్లితెర తారలు చెబుతున్నారు.
జెమినీ టీవీ గణేష్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ECILలో యువసేన యూత్ అసోసియేషన్‌లో ‘ఉప్పెన’ ఫ్యామిలీ డ్రామా సీరియల్లో హీరోయిన్‌గా నటిస్తున్న జనని (సోనియా), ఆర్టిస్ట్‌గా నటిస్తున్న SKR (JL srinivas) భార్గవ్ కృష్ణ (కార్తిక్ ప్రసాద్), ఏఎస్ రావ్ నగర్ డివిజన్ 2 కార్పొరేటర్ సుంగి రెడ్డి శిరీష సోమశేఖరరెడ్డి, ‘సాధన’ సీరియల్ నుండి హీరో విరాజ్(హుస్సేన్), హీరోయిన్ సాధన (శాంభవి), ఆర్టిస్ట్స్ మీనాక్షి(సీత), దీప (ప్రియ) నవజ్యోతి యూత్ క్లబ్ గణేష్ మండపాలని సందర్శించారు.