Konidela Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన తమకు పుట్టబోయే పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను అందరూ డైమండ్ స్పూన్ తో పుట్టావని అంటుంటారని… కానీ దాని వెనక తన తల్లిదండ్రుల కష్టం ఎంతో ఉందని ఆమె తెలిపింది. ఆ కష్టం విలువ తనకు తెలుసని.. అందుకే తాము కనబోయే పిల్లలకు కష్టం విలువ తెలిసేలా పెంచుతామని స్పష్టం చేసింది. తన పుట్టుకుకు ఓ కారణం ఉందని.. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండి కూడా ప్రజల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయకపోతే తన జీవితానికి అర్థం ఉండదని పేర్కొంది. కాగా ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన((Upasana)).. త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది.