కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. రాహుల్ మీద విమర్శలు చేస్తే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మానవ బాంబులు అవుతామని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీని చంపుతామని అంటున్న వారి మీద చర్యలు తీసుకోకపొతే..ప్రధాని మోదీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని భావించాల్సి వస్తుందన్నారు. వెంటనే రవ్‌నీత్ సింగ్ బిట్టూను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం డిమాండ్ చేశారు.