నారాయణపేట జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ పర్యటించారు. సర్వ మండలం రాయికోడ్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్, పల్లె దవఖానాను సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం,పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారానే నిధులు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేసి ప్రస్తుతం 500 మండలాలను గుర్తించిందన్నారు. వాటిలో కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే రాయికోడ్ గ్రామంలోని అంగన్వాడీ, పల్లె దవఖాన, పాఠశాలలను పరిశీలించానన్నారు.