జోగులాంబ జిల్లాలో దారుణం జరిగింది. రోజు తాగి వచ్చి తన కూతుర్ని హింసిస్తుండడంతో తట్టుకోలేని తండ్రి తన సొంత అల్లుడిని రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఉండవల్లికి చెందిన చాకలి మద్దిలేటి తన రెండో కూతురు మహేశ్వరిని కర్నూలుకు చెందిన దేవేందర్ తో ఆరు సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు సంతానం ఈ క్రమంలో దేవేందర్ తాగుడుకు బానిసై రోజు తాగి వచ్చి గొడవ చేస్తూ భార్య ను కొట్టేవాడు పలుమార్లు అల్లుడికి సర్ది చెప్పిన వినకపోవడంతో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయిన దేవేందర్ లో ఎలాంటి మార్పు రాలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా అంటూ మరింత రెచ్చిపోయి మద్యం మత్తులో మహేశ్వరినీ మరింతగా హింసించేవాడు. ఈ క్రమంలో మహేశ్వరి తన బాధను తండ్రి వద్ద చెప్పుకొని బోలున విలపించింది. కూతురు పడుతున్న బాధలను భరించలేని తండ్రి మద్దిలేటి రాత్రి దేవేందర్ ఇంట్లో నిద్రిస్తుండగా ఇటుక రాళ్లతో కొట్టి హత్య చేశాడు. ఉదయం తెల్లవారు జామున గమనించిన కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో పోలీసులకు సమాచారం అందిం చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ రవిబాబు తెలిపారు. హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.