ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నాయకుడు చీపురుగూడెం దుర్గుమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి మొక్కు చెల్లించుకున్నాడు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే, తన స్వగ్రామంలోని రామాలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకూ రోడ్డుపై పొర్లు దండాలు పెడతానని అమ్మవారిని వేడుకున్నాడు. తాను కోరుకున్నట్టే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా అధికారాన్ని చేతపట్టారు. ఈ సందర్భంగా మొక్కు చెల్లించుకున్నారు టీడీపీ నాయకుడు వంట్ల పెద రామన్న.అనంతపురంలోనూ ఇలాగే మొక్కలు చెల్లించుకున్నాడు టీడీపీ అభిమాని. తాము కోరుకు న్నట్టే ఏన్డీఏ కూటమి జగన్‌ను గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణ పల్లిలోని పెద్దమ్మ తల్లికి వేయి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు కథలప్ప.