మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. నేడు విచారణ జరగాల్సి ఉండగా రేపు వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిన అవినాశ్ రెడ్డి.. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే మకాం వేసినట్లు సమాచారం. అంతకుముందు అవినాశ్ కు ఈనెల 25వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులను సీజేఐ ధర్మాసనం రద్దు చేసింది.