ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో 3.45గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5గంటల వరకు అవినాశ్ ను విచారణకు పిలవొద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో సాయంత్రం 5 గంటల తర్వాతే విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో రేపు ఉదయం 10.30గంటలకు విచారణకు హాజరుకావాలని తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాశ్.. సీబీఐ నోటీసులతో ఇంటికి బయలుదేరారు.


