ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కు ఆకస్మాత్తుగా బీఆర్ఎస్ పార్టీపై అంత ప్రేమ ఎందుకో? తెలంగాణ వాళ్లతో ఈ కొత్త బంధం ఏంటో? అని ప్రశ్నించారు. మంత్రులు తెలంగాణ ప్రజలను ఎక్కడా విమర్శించలేదని స్పష్టం చేశారు. కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు హరీశ్ రావు ఏపీ గురించి ఏ వ్యాఖ్యలు చేశారో పవన్ కు తెలుసా? తెలుసుకోకుండా తమపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యాపారాల కోసమే తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని.. అందుకే వారిపై ఈగ వాలనివ్వడం లేదని పేర్ని ఎద్దేవా చేశారు.
తెలంగాణ వాళ్లతో కొత్త బంధంపై పవన్ సమాధానం చెప్పాలి: పేర్ని
0
495
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


