స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఈ కార్యక్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవతో గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తుమన్నారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.
రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు- కేంద్ర మంత్రి
సీఎం జగన్ మాట్లాడుతూ.. నన్ను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నామన్నారు.
ఇక.. గిరిజన యూనివర్సిటీ కోసం మెంటాడ మండలం చినమేడిపల్లిలో భూసేకరణ చేశారు అధికారులు. ఈ యూనివర్శిటీలో మొత్తం 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులతోపాటు పరిశోధనల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ సంబందించిన క్లాసులు తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నాయి.
Latest Articles
- Advertisement -