34.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

సర్వత్ర నెలకొన్న ఆసక్తి.. తుమ్మల దారెటో మరి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి జిల్లా కీలక నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) నేడు భారీ బల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంకు(Khammam) వస్తున్న తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాయకన్ గూడెంకు తరలివస్తున్నారు. 2 వేల కార్లతో భారీ ర్యాలీగా బల ప్రదర్శన చేయనున్నారు.

ఇక  తుమ్మల పాలేరు(Paleru) అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. సీఎం కేసీఆర్‌(CM KCR) విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో భంగపడ్డారు.  పాలేరు టికెట్‌ను కందాల ఉపేందర్‌ రెడ్డికి అధిష్టానం కేటాయించడంతో.. పార్టీలో కనీస గౌరవమర్యాదలు లేకపోవడంపై అలకబూనారు. రాయబారాలు, బుజ్జగింపులపై అసహనంతో ఉన్న తుమ్మల.. పొలిటికల్‌గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్ర ఆసక్తి నెలకొంది. అటు తుమ్మల అనుచరులు మాత్రం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారు.
కాగా.. తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన.  ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్