తిరుపతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో రెండు వేర్వేరు చోట్ల ఈ తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ రెండు ఘటనల్లో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
బైరాగిపట్టెడ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా.. శ్రీనివాస అతిథిగృహం దగ్గర ఒకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. రెండు వేర్వేరు ఘటనల్లో మరో 48 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి తొక్కిసలాటలో మృతులను గుర్తించారు. మృతులు విశాఖకు చెందిన రజిని (47), శాంతి (34), లావణ్య (40). మృతులు నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), కర్ణాటక బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49)గా గుర్తించారు.