కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూర్లో విషాదం నెలకొంది. ఉగాది ఉత్సవాల సందర్భంగా జరిగిన రథోత్స వంలో కరెంట్ తీగలు తగిలి 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలపాలైన చిన్నారులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అయితే చిన్నారులకు ప్రాణా పాయం లేదని వైద్యులు తెలిపారు.


